Sunday, 24 November 2013

Photos of Round Table Conveference of the leaders of the Associations and Groups working for the disabled dt. 24/11/2013.











వికలాంగ ఉద్యోగులందరికి విజ్ఞప్తి
ప్రియమైన మిత్రులారా,

          1995 వ సంవత్సరంలో వికలాంగుల చట్టం, తేదీ 07/02/1996 నాడు పార్లమెంట్ ఆమోదించినప్పటి నుండి ఇప్పటివరకు అనగా 18 సంవత్సరం లు గడిచినా, ఇంతవరకు చట్టం యొక్క ఫలితాలను వికలాంగులు అందుకోలేక పోయినారు. ఇట్టి విషయమై వికలాంగులు నిరాశ, నిస్పృహళే కాకుండా కోపానికి కూడా గురి అగుచున్నారు. ఎన్నో సార్లు న్యాయ వ్యవస్థ వికలాంగులకు అనుకూలంగా తీర్పులిచ్చినా ప్రభుత్వం మరియు అధికారులు నిర్లక్ష్యం, అశ్రద్దవహించడం వలన ఇట్టి పరిస్థితి దాపురించి, చట్టం అమలుకు నోచుకోలేదు.
          ఎన్ని సార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఫలితం లేనందునా గత్యంతరం లేక ఈ క్రింద పేర్కొన్న 12 సమస్యలను ప్రభుత్వం నకు నివేదించి 15 రోజులలోగా పరిష్కరించక పోతే 03/12/2014 నాడు వికలాంగులంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని బహిష్కరిస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగులంతా హైదరాబాద్ లో ధర్నా జరిపి నిరసన తెలుపూతకు నోటిస్ ఇవ్వదమైనది.
  1. ప్రమోషన్లలో రిసర్వేషన్ 1996 వ సంత్సరం నుండి కల్పించాలని, ఆ మేరకు తగిన ఉత్తర్వులు, అమెండ్మెంట్లు జారీ చేయాలి మరియు అప్పటినుండి ఇప్పటివ్కారకు జరిగిన అన్నీ పానెల్ లను రివ్వ్యూ చేసి చట్టాన్ని పక్క గా అమలు చేయాలి.
  2. వికలాంగ ఉద్యోగులకు ప్రత్యేకమైన ట్రాన్సఫర్ పాలసీ రూపొందించి పని చేసే వాతావరణాన్ని కల్పించాలి.
  3. బదిర ఉద్యోగులకు మిగతా వికలాంగ ఉద్యోగులకు చెల్లిస్తున్నట్లుగా, పి.ఆర్.సి. 2010 సిఫారసు చేసినట్లుగా కన్వేయన్స్ అలవెన్సు చెల్లించాలి.
  4. కేంద్ర ప్రభుత్వ వికలాంగ ఉద్యోగులకు చెల్లిస్తున్నట్లుగా ఎల్.టి.సి. మరియు అధికారిక ప్రయాణాలలో  స్వంత లేదా అద్దె వాహనాలను వాడుకొనుటకు మైలేజ్ అలవెన్సు చెల్లించాలి.
  5. నియామకాలలో వయసు రిలక్సేషన్ పొంది, తక్కువ సేవలందించిన వికలాంగ ఉద్యోగులకు, సేవా తో సంబందం లేకుండా పూర్తి పింఛన్ అనుమతింఛాలి. 01/09/2004 తర్వాత నియామకం ఐన వికలాంగ ఉద్యోగులకు సి.పి.ఎస్. కాకుండా డిఫెన్స్ ఉద్యోగుల మాదిరిగా పింఛన్ అనుమతింఛాలి. ప్రభుత్వ రంగ సంస్తలలో పని చేయుచున్న వికలాంగ ఉద్యోగులకు ప్రత్యేకమైన పింఛన్  సౌకర్యం కల్పించాలి.
  6. కేంద్ర ప్రభుత్వ వికలాంగ ఉద్యోగులకు చెల్లిస్తున్నట్లుగా మహిళ వికాలంగ ఉద్యోగులందరికి శిశు సంరక్షణ బృతి చెల్లించాలి.
  7. కేంద్ర ప్రభుత్వ వికలాంగ ఉద్యోగులకు అనుమతించినట్లుగా 10 రోజుల ప్రత్యేక సెలవులు ఇవ్వాలి.
  8. ఉన్నత విద్య కొరకు ఎస్.సి, ఎస్. టి. ఉద్యోగులకు వలె వికలాంగ ఉద్యోగులకు కూడా డెప్యూటేషన్ వసతి కల్పించాలి.
  9. పి.డబ్ల్యు. చట్టం ప్రకారం ప్రత్యేక భీమా సౌకర్యం కల్పించాలి.
10.  వివిద పనులపై/అనారోగ్యంతో వచ్చు వికలాంగ ఉద్యోగులకు హైదరాబాద్ లో  మరియు జిల్లాలలో ప్రత్యేక వసతి  కల్పించాలి.
  1. కార్యాలయాలలో మరియు పబ్లిక్ స్తలాలలో barrier free (వసతి ) వాతావరణాన్ని కల్పించాలి.
  2. PWD ఆక్టు కమిషనర్ను వెంటనే నియమించాలి.
  3. 2003 వ సంవత్సరం నుండి ఎన్నో వికాలంగా ఉద్యోగుల సంస్యలను పరిష్కరించడంలో ఇటు ప్రభుత్వానికి మరియు వికాలంగా ఉద్యోగులకు సేవలండిస్తున్న మా ఈ సంగాన్ని గుర్తించి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సభ్యత్వం కల్పించాలి.

వికలాంగ ఉద్యోగుల యొక్క సమస్యలను సాధించుకోవడానికి అందరూ సమైఖ్యంగా పోరాడాలని, 03/12/0213 నాడు నిర్వహించతలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సంఘం విజ్ఞప్తి చేస్తుంది.


ముక్కు నర్సయ్య                                                                       కాసర్ల అమృత రెడ్డి
           ప్రధాన కార్యదర్శి                                                                              అద్యక్షుడు

No comments: